: జంతర్ మంతర్ వద్ద ధర్నా
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు ఏపీఎన్జీవోలు, సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు కార్యాచరణ రచించారు. త్వరలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు నిర్ణయించారు. సచివాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు మూడు రోజుల్లో తేదీ ప్రకటించనున్నట్టు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కన్వీనర్ మురళీకృష్ణ తెలిపారు. విభజన వల్ల జరిగే నష్టాన్ని సచివాలయంలో కూడా పద్యాలు, గేయాలు, నాటకాల రూపంలో వినూత్నంగా వెలిబుచ్చేలా ప్రణాళిక రచించినట్టు ఆయన వెల్లడించారు.