: రష్యా ప్రతిపాదనకు అంగీకరించిన సిరియా


తిరుగుబాటుదారులపై రసాయనిక దాడులకు పాల్పడిందంటూ అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహానికి గురైన సిరియా దిగివస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. తనవద్ద రసాయనిక ఆయుధాల్లేవని బుకాయిస్తున్న సిరియా తాజాగా రష్యా ప్రతిపాదనకు అంగీకరించింది. తన కెమికల్ వెపన్స్ ను అంతర్జాతీయ నియంత్రణలో ఉంచేందుకు సమ్మతించింది. అంతకుముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తో సిరియా విదేశీ వ్యవహారాల మంత్రి వాలిద్ అల్-మొవల్లమ్ మాస్కోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మొవల్లమ్ మాట్లాడుతూ, అమెరికా దాడి ప్రయత్నాలను నిలువరించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. రష్యా చేసిన సూచనకు తాము సానుకూలంగానే ఉన్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News