: త్వరలోనే తెలంగాణ నోట్: మధుయాష్కీ
త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ వస్తుందని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతల భేటీ అనంతరం ఆయన ఈ విధంగా స్పందించారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణ ఏర్పడుతుందని... తెలంగాణవాదులెవ్వరూ నిరాశపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తెలంగాణలో హైదరాబాద్ లేకపోతే ఈ ప్రాంతం ఆర్థికంగా నిలదొక్కుకోలేదని తెలిపారు.