: రాహుల్ గాంధీకి అస్సాం సీఎం వ్యక్తిగత మద్దతు


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేందుకు అర్హుడేనంటూ పలువురు మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీలో అంతర్గతంగా నిర్ణయం జరిగిపోయినా ప్రకటించడానికి సమయం, సందర్భం కోసం సోనియా సంయమనం పాటిస్తున్నారన్నది బహిరంగ సత్యం. అయితే, బయటినుంచి చాలామంది తమ మద్దతు రాహుల్ గాంధీకేనంటూ వెల్లడిస్తున్నారు. తాజాగా, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తన మనసులో మాట చెప్పేశారు. 2014 ఎన్నికలకు కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్ధిగా రాహుల్ గాంధీకే తన వ్యక్తిగత మద్దతంటున్నారు. కాగా, పార్టీ ప్రధాని అభ్యర్ధిగా రాహులే సరైన ఎంపికని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్న మాటలను ఉటంకించిన గొగోయ్.. అందుకే తన నిర్ణయాన్ని బయటికి వెల్లడించానని గౌహతిలో మీడియా ఎదుట అభిప్రాయాన్ని తెలిపారు.

  • Loading...

More Telugu News