: కాంగ్రెస్ అవినీతిని వెరైటీగా విమర్శించిన మోడీ
కాంగ్రెస్ పార్టీ ఏబీసీడీల అర్థాలనే మార్చేసిందని గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ దుయ్యబట్టారు. అక్షరమాలలోని ఒక్కో అక్షరం కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న ఒక్కో కుంభకోణాన్ని సూచిస్తుందని విమర్శించారు. 'ఏ ఫర్ ఆదర్శ్, బీ ఫర్ బోఫోర్స్, సీ ఫర్ కామన్ వెల్త్ గేమ్స్, డీ ఫర్ దామాద్ కా కారోబార్' అంటూ ఏబీసీడీలకు అర్థం చెప్పుకొచ్చారు. రాజస్థాన్ లోని జైపూర్ లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షురాలు వసుంధర రాజె పాల్గొన్నారు.