: శాంతిభద్రతలపై సీఎం సమీక్ష
రాష్ట్రంలో శాంతిభద్రతలపై సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఓవైపు.. మరోవైపు ప్రాంతీయ ఉద్యమాలను దృష్టిలో ఉంచుకుని.. జంటనగరాల్లో ఎప్పటికప్పుడు భద్రతను పటిష్టం చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నిరంతరం తనిఖీలు నిర్వహించాలని భద్రతను పటిష్టం చేయాలని సూచించారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ కొనసాగుతున్న ఉద్యోగుల సమ్మె, దాని ప్రభావం వంటి అంశాలను కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు.