: కాంగ్రెస్ లో అవినీతి ఓ భాగం: మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో అవినీతి ఓ భాగమని విమర్శించారు. అధికారం నుంచి కాంగ్రెస్ ను దింపినప్పుడే అవినీతిని కూడా పారదోలవచ్చన్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ అధికార పార్టీపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ లో అత్యంత అవినీతిపరుడైన ప్రధానిగా మన్మోహన్ సింగ్ విజయవంతంగా కొనసాగుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. 1947కు ముందుకు కాంగ్రెస్ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడితే.. తర్వాత ఆ పార్టీ ఓ కుటుంబాన్ని సేవించుకోవడంలో తరిస్తోందన్నారు. కానీ, బీజేపీ భారత భక్తిలో మునిగిందని మోడీ పేర్కొన్నారు. ఇది దేశంలోని 125 కోట్ల ప్రజలకు మంచి చేసిందని చెప్పారు.