: కృష్ణా జిల్లా బంద్ కు ఏపీఎన్జీవోల పిలుపు
సమైక్యాంధ్రకు మద్దతుగా రెండు రోజుల పాటు కృష్ణా జిల్లా బంద్ కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. అయితే బంద్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపునిస్తున్నట్టు ప్రకటించారు. బంద్ వల్ల జిల్లా వ్యాప్తంగా వాణిజ్య, రవాణా, సినిమా కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.
ఇక విజయవాడ విషయానికొస్తే... నగరంలో ఈ రోజు సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆటోనగర్ లో చిన్నతరహా పరిశ్రమల వ్యాపారులు ఇందులో పాల్గొన్నారు. ఆరు వారాల నుంచి సీమాంధ్ర స్తంభించిపోయినా కేంద్రంలో చలనం రాలేదని ర్యాలీలో పాల్గొన్నవారు విమర్శించారు. ఇప్పటికైనా విభజన ప్రకటనను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.