: హైకోర్టు ప్రాంగణంలో మౌన దీక్ష చేపట్టిన సీమాంధ్ర లాయర్లు


హైకోర్టు ప్రాంగణంలో సీమాంధ్ర న్యాయవాదులు మౌన దీక్ష చేపట్టారు. హైదరాబాదులోని హైకోర్టు ప్రాంగణంలో గతవారం మానవహారం ఏర్పాటు చేసిన సందర్భంగా సీమాంధ్ర న్యాయవాదులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమపై దాడికి నిరసనగానూ, సమైక్యాంధ్రకు మద్దతుగానూ సీమాంధ్ర న్యాయవాదులు మౌన దీక్షకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు న్యాయవాదులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News