: ప్రపంచంలోనే పెద్ద దేవాలయం నిర్మిస్తున్న ఇస్కాన్


ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేవాలయం నిర్మించేందుకు ఇస్కాన్ సన్నాహాలు చేస్తోంది. ఇస్కాన్ ఏర్పడి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2016 కల్లా ఈ దేవాలయాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. దాదాపు 400 కోట్ల రూపాయలతో 7 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ బృహత్ దేవాలయాన్ని నిర్మించాలని ఇస్కాన్ భావిస్తోంది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాయాపూర్ లో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచంలోని కృష్ణ భక్తులందరికీ ఈ దేవాలయం ఓ వేదిక కావాలని ఇస్కాన్ ఆకాంక్షిస్తోంది. ఈ ఆలయ నిర్మాణానికి ప్రముఖ మోటారు వాహనాల సంస్థ ఫోర్డ్ ఆర్థిక సాయం అందిస్తోంది. 

  • Loading...

More Telugu News