: హాస్పిటల్ లో ఉన్న సోనియాకు సమన్లు


కేన్సర్ చికిత్స కోసం న్యూయార్క్ కు వెళ్లిన సోనియాకు ఆసుపత్రిలోనే సమన్లు అందజేయనున్నారు. ఈ నెల 3న సోనియాకు వ్యతిరేకంగా అమెరికాలోని సిక్కు హక్కుల సంస్థ, 1984 సిక్కు అల్లర్ల బాధితులు కొందరు కలిసి న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. నాటి అల్లర్లలో పాత్రధారులైన కాంగ్రెస్ నేతలకు సోనియా రక్షణగా నిలిచారని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై లోగడే కోర్టు సోనియాకు సమన్లు జారీ చేసింది. వాటిని ప్రస్తుతం చికిత్స కోసం అమెరికా వచ్చిన సోనియాకు ఆసుపత్రిలోనే సిబ్బంది ద్వారా గానీ, ఆమె భద్రత కోసం నియమించిన సెక్యూరిటీ సిబ్బంది ద్వారా గానీ, ఎఫ్ బీఐ పోలీసుల ద్వారా గానీ అందించేందుకు అనుమతించాలని పిటిషనర్లు కోరారు. ఇందుకు కోర్టు అనుమతించింది.

  • Loading...

More Telugu News