: లేఖ రాశానంటున్న మోహన్ బాబు


భారతీయ సినిమా వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని చెన్నైలో సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు ఉత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో ప్రజలు ఉద్యమాల బాట నడుస్తుంటే, తాము ఇలాంటి పండగ చేసుకోవడం సబబు కాదంటున్నారు మోహన్ బాబు. ఆయన నేడు కన్నడనటుడు, రాజకీయనేత అంబరీశ్, సుమలత దంపతులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పరిస్థితుల నేపథ్యంలో వందేళ్ళ సినిమా పండగను వాయిదా వేయండంటూ దక్షిణాది ఫిల్మ్ చాంబర్ కు ఓ లేఖ రాసినట్టు తెలిపారు. అయితే, వాయిదా వేస్తారో లేదో అది నిర్వాహకుల ఇష్టమని, లేఖలో కేవలం తన అభిప్రాయం వెల్లడించానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News