: సీఎల్పీ కార్యాలయంలో భేటీ కానున్న టీ కాంగ్రెస్ నేతలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో... టీ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ నెలకొంది. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే ఓడించాలని కాంగ్రెస్ సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం సూచించినట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో వారు కలవరపాటుకు గురవుతున్నారు. దీంతో భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు వారు ఈ రోజు సీఎల్పీ కార్యాలయంలో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో... ఏపీఎన్జీవోల సభ సమయంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం, సీఎం వ్యవహారశైలి, ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియను వేగవంతం చేయడంలాంటి అంశాలను చర్చించే అవకాశముంది. తెలంగాణను ఇస్తున్నది, తెస్తున్నది తామేనన్న భావనను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశం గురించి కూడా చర్చించనున్నట్టు సమాచారం. టీ కాంగ్రెస్ నేతలందరూ సీఎం కిరణ్ ను కలసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాల్సిందిగా కోరనున్నట్టు తెలుస్తోంది.