: నదిలో బస్సు పడిన ప్రమాదంలో 44 మంది మృతి
గ్వాటెమాలాలో ఓ బస్సు అదుపుతప్పి నదిలో పడటంతో 44 మంది ప్రయాణికులు మరణించారు. 46 మంది గాయపడ్డారు. ప్రమాదం సమయంలో బస్సులో 90 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. బస్సు సామర్ధ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్ళడమే ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.