: 36కి చేరిన మృతులు.. వెయ్యి మందిపై కేసులు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ జిల్లాలో మత ఘర్షణల కారణంగా మరణించిన వారి సంఖ్య 36కి చేరుకుంది. పోలీసులు 1,000 మందిపై కేసులు నమోదు చేశారు. 286 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉన్నారు. ఈ నేపథ్యంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదనపు పోలీసు బలగాలను ముజఫర్ నగర్ కు పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది.