: గణితానికి గాబరా అనవసరం
కొందరికి లెక్కలంటే మహా భయం. అయితే లెక్కలు కొద్దిగా మనసుపెట్టి అర్ధం చేసుకుంటే వాటికి మించిన సులభమైన సబ్జక్టు మరోటి లేదంటారు. అందుకే ఎవరైనా లెక్కల గురించి దిగులు చెందకుండా చక్కగా కష్టపడి పనిచేయాలన్న ధ్యాస ఒక్కటుంటే చాలునని పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
మనలో చాలామంది పిల్లలు లెక్కల్లో వెనుకబడి ఉంటే లెక్కలు నేర్చుకోండి అంటూ వాళ్లను పుస్తకాల ముందు బలవంతంగా కూర్చోబెడుతుంటారు. ఇలా కూర్చోబెట్టడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. వీరు కొందరు పిల్లలు ఐదవ తరగతిలో ఉండగా లెక్కల్లో సాధారణ మార్కులను తెచ్చుకున్న పిల్లల్ని చక్కగా ప్రోత్సహించి వారి అధ్యయనంలో చురుకైన మెళకువలను పాటించేలా చేయడంతో వారు ఎనిమిదవ తరగతికి వచ్చేసరికి గణితంలో మంచి మార్కులు తెచ్చుకున్నారట. అంటే అన్ని సబ్జక్టులతోబాటు గణితంలో కూడా వారి సామర్ధ్యం మెరుగుపడింది. కాబట్టి లెక్కల్లో వెనుకపడ్డంత మాత్రాన గాబరాపడకుండా... చక్కగా అధ్యయనంలో మెళకువలను పాటిస్తూ చదవడంతో ఈ వెనుకబాటును అధిగమించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.