: తెలంగాణపై వెనకడుగు లేదు.. విభజన తధ్యం: భక్తచరణ్ దాస్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రశ్నేలేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భక్తచరణ్ దాస్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ కేబినెట్ నోట్ తో సహా పలు కీలక చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని ఆయన అన్నారు. సీమాంధ్ర, తెలంగాణలో జరుగుతున్న అన్ని చర్యలను ప్రభుత్వం గుర్తిస్తోందని, వాటి నివారణకు చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.