: బీజేపీ నిజనిర్థారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు
ఉత్తరప్రదేశ్ లో అల్లర్లు జరిగిన ముజఫర్ నగర్ కి వెళ్తున్న బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నిజనిర్థారణ బృందంగా ఏర్పడిన కొంత మంది బీజేపీ నేతలు రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో ముజఫర్ నగర్ బయల్దేరి వెళ్లారు. అక్కడ అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఉదయం వెళ్లిన కాంగ్రెస్ నేతల్ని కూడా యూపీ పోలీసులు అడ్డుకున్నారు.