: చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం
చిత్తూరు జిల్లా పాకాల మండలం కోనెబోయినఇండ్లు గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. దగ్గర్లోని అడవుల్లోంచి గ్రామం మీదికి దండెత్తిన ఏనుగులు చెరకుతోటలు, నీటి సరఫరా గొట్టాలను ధ్వంసం చేశాయి. గ్రామస్థులు వాటిని వెళ్లగొట్టేందుకు డప్పులు, వాయిద్యాలతో ప్రయత్నించినప్పటికీ అవి వెళ్లడం లేదు. దీంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారి వాటిని గ్రామంలోకి రాకుండా నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నారు.