: బాబు యాత్ర ప్రారంభం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర కృష్ణా జిల్లాలో నాలుగో రోజు రెడ్డిగూడెం నుంచి ప్రారంభమైంది. వికాస్ కళాశాల ఆవరణలో వినాయక చవితి ప్రత్యేకపూజలో ఆయన పాల్గొన్నారు. పూజల్లో విఘ్ననాయకుడ్ని రాష్ట్రానికి పూర్వవైభవం కల్పించాలని కోరారు. తెలుగు జాతి ఒక్కటిగా ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన తన యాత్రను ప్రారంభించారు. ఈ రోజు మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో ఆయన యాత్ర సాగనుంది.