: విశాఖలో కోలువైన భారీ బాల గణేషుడు


విశాఖలో వినాయక మహాత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహానగరంలో పలు ప్రాంతాల్లో గణపతి నవరాత్రులకు వివిధ భక్త బృందాలు భారీ గణపయ్యలను నెలకొల్పారు. గాజువాకలో 77 అడుగుల భారీ బాల గణపయ్యను ఏర్పాటు చేశారు. దొండపర్తిలో 72 అడుగుల విఘ్ననాయకుడ్ని ఏర్పాటు చేశారు. కాగా సత్యం జంక్షన్ లో 65 అడుగుల భారీ వినాయకుడ్ని ఏర్పాటు చేశారు. ఈ ఉదయం తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు. ఆశీలుమెట్ట జంక్షన్ లో ఉన్న సంపత్ వినాయక దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఈ దేవాలయంలో నవరాత్రుల సందర్భంగా వినాయకుడ్ని రోజుకో రూపంలో అలంకరించనున్నారు.

రాష్ట్రంలో ప్రసిద్ది గాంచిన హైదరాబాద్ ఖైరతాబాద్ లో 59 అడుగుల విఘ్నేశ్వరుడ్ని ఏర్పాటు చేశారు. ఈ వినాయకుడ్ని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. వినాయకుడికి తాపేశ్వరం నుంచి 4,200 కేజీల లడ్డూను భక్తులు పంపించనున్నారు. కాగా విఘ్ననాయకుడి పూజలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. ఈ పూజలో ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News