: కొలువు దీరిన గణపయ్య.. ఉప్పొంగనున్న భక్తి భావం
జంట నగరాలు పది రోజుల పాటు గణనాథ స్మరణతో, ఆధ్యాత్మిక సందడితో పులకించిపోనున్నాయి. ప్రతీ వీధిలోనూ విఘ్నేశ్వరుడు కొలువు దీరాడు. జంట నగరాలలో మొత్తం మీద 50 వేల నుంచి 80 వేల మధ్యలో గణపయ్య విగ్రహాలను ప్రతిష్ఠించి ఉంటారని అంచనా. ఈసారి ఎక్కువ విగ్రహాలు మణ్టితో చేసినవే ఉన్నాయి. అర్ధరాత్రి వరకూ భక్తులు పూజా సామాగ్రిని కొనుగోలు చేశాయి. ఈ ఉదయం కూడా పూజా సామాగ్రి కొనుగోలు చేయడానికి అధిక సంఖ్యలో ప్రజలు మార్కెట్లకు వచ్చారు. నిత్యావసరాల ధరలు పెరిగిన ప్రభావం పూజాసామాగ్రిపై కూడా పడింది. విగ్రహం దగ్గర నుంచి పత్రి, పూజా సామాగ్రి ధరలు 50 శాతం పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ భక్త బృందాలు గణేశ్ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు రెడీ అయిపోయాయి. ఉత్తరాది రాష్ట్రాలలో కూడా గణేశ్ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇంతపెద్ద ఎత్తున, సామూహికంగా, వైభవంగా జరుపుకునే పండగ ఇదొక్కటే కావడం విశేషం.