: రాష్ట్రపతి, ప్రధాని వినాయక చవితి శుభాకాంక్షలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధికి కృషి చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని రాష్ట్రపతి పిలుపు నిచ్చారు. జాతి విస్తృత ప్రయోజనాల కోసం మనల్ని మనం అంకితం చేసుకునేందుకు ఈ పర్వదినం స్ఫూర్తినిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.