: పీఎస్ఎల్వీ సీ-20 ఆలస్యానికి కారణం


నిన్న భారత కీర్తిని నలుదిశలా వెదజల్లుతూ.. అంతరిక్షంలోకి విజయ దరహాసంతో తీసుకుపోయిన పీఎస్ఎల్వీ సీ-20 ప్రయోగం..చివరి క్షణాల్లో అయిదు నిమిషాలు వాయిదా వేశారు. దీనికి కారణం ఏంటో తెలుసా? అంతరిక్షంలో ట్రాఫిక్ జాం కావడం..

అంతరిక్షంలో ట్రాఫిక్ జామేంటి! అని ఆశ్చర్యపోకండి. ఇది నిజమే..రాకెట్ ప్రయోగం జరగనున్న సమయంలో అంతరిక్షంలో కొన్నిగ్రహశకలాలు అడ్డుగా ఉండటాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఆలస్యంగా గుర్తించారు. దీంతో షెడ్యూల్ సమయానికి కంటే ఐదు నిమిషాల తర్వాత రాకెట్ ను ప్రయోగించారు. ఇలాంటి కారణాలతో రాకెట్ ను గరిష్ఠంగా ఇరవై నిమిషాల వరకు ఆలస్యంగా ప్రయోగించేందుకు అనుమతులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ సమయాన్నే లాంచ్ విండో అంటారు.

  • Loading...

More Telugu News