: రాష్ట్ర ప్రజలకు సీఎం వినాయక చవితి శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుని కటాక్షంతో ప్రభుత్వ విధానాలన్నీ, నిర్విఘ్నంగా, నిరాటంకంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కూడా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.