: మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ప్రయాణిస్తున్న కారుకు అగ్ని ప్రమాదం


మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటన నల్గొండ జిల్లా భువనగిరిలోని సింగన్నగూడెం క్రాస్ రోడ్ వద్ద జరిగింది. మంత్రి వరంగల్ లో ఒక సమావేశానికి హాజరై హైదరాబాద్ కు తిరిగి వెళుతూ పట్టణ శివారులో ఉన్న వివేరా హోటల్ లో టీ తాగి తిరిగి ప్రయాణమయ్యారు. కొంత దూరం ప్రయాణించిన అనంతరం కారు ఇంజిన్ భాగం నుంచి స్వల్పంగా మంటలు, పొగ రావటం గుర్తించారు. దీంతో మంత్రి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డి, పీఏ, నలుగురు గన్ మెన్ లు వెంటనే కారు దిగి బయటకు వచ్చారు. క్షణాలలోనే మంటలు కారును వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. మంటలను సకాలంలో గుర్తించడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే వచ్చి కారులో మంటలను ఆర్పివేశారు. అనంతరం మంత్రి వేరొక కారులో హైదరాబాద్ కు బయలుదేరివెళ్లారు.

  • Loading...

More Telugu News