: విభజన తర్వాత హైదరాబాదులో బతకలేరు: షర్మిల


హైదరాబాదులో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ నేపథ్యంలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై వైఎస్సార్సీపీ నేత షర్మిల మాట్లాడారు. సమైక్య శంఖారావం యాత్ర సందర్భంగా షర్మిల నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మాట్లాడుతూ.. హైదరాబాదులో న్యాయవాదులపైనా, ఏపీఎన్జీవోలపై దాడులు జరిగాయని, ఇప్పుడే ఇలా ఉంటే విభజన జరిగిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆమె భయాందోళనలు వ్యక్తం చేశారు. రాష్ట్రానికి హైదరాబాదు నుంచే ప్రధానంగా ఆదాయం వస్తోందని, అలాంటి రాజధానిని పదేళ్ళలో నిర్మించుకోవాలంటే అయ్యేపనికాదని చెప్పుకొచ్చారు. ఇక, విభజనకు కారకుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే అని మండిపడ్డారు. బ్లాంక్ చెక్ లాంటి లేఖ ఇచ్చి విభజనకు సమ్మతి తెలిపారని దుయ్యబట్టారు. బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని, ఆ రోజు మరెంతో దూరంలో లేదని అన్నారు.

  • Loading...

More Telugu News