: బస్సులపై దాడిని ఖండించిన అశోక్ బాబు
సీమాంధ్ర ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సులపై తెలంగాణవాదులు దాడిచేయడాన్ని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ఖండించారు. మొత్తం 11 బస్సులపై రాళ్లు రువ్వారని... ఈ దాడుల్లో ఆరుగురు ఉద్యోగులు గాయపడ్డారని తెలిపారు. వీరందరికీ తమ సంఘం తరఫున చికిత్స చేయిస్తామని చెప్పారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని... దాడులతో ఏమీ సాధించలేమని ఆయన అన్నారు. తెలంగాణవాదులు గుంటూరులో సభ నిర్వహించుకోవాలనుకుంటే... వారికి తాము సహకరిస్తామని... ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూస్తామని తెలిపారు.