: 'జై తెలంగాణ' అన్న కానిస్టేబుల్ కు లక్ష నజరానా
హైదరాబాదులో నిన్న 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలో శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదాలతో ఎలుగెత్తిన సంగతి తెలిసిందే. ఆనక అతడిని పోలీసులు బలవంతంగా అక్కడినుంచి తరలించారు. అయితే, అతడి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని టీఆర్ఎస్ నేత జితేందర్ రెడ్డి కొనియాడారు. అంతేగాకుండా అతడికి లక్ష రూపాయల చెక్కును కానుకగా పంపారు. సమైక్యాంధ్ర సభలో జై తెలంగాణ అంటే తప్పేంటని జితేందర్ ప్రశ్నించారు. ఇక, శ్రీనివాస్ లాంటి వ్యక్తులు ఉద్యమానికి ఎంతో అవసరం అని పేర్కొన్నారు.