: సీఎం, డీజీపీలపై మండిపడ్డ వివేక్


ఎంపీ వివేక్ నేడు ముఖ్యమంత్రి కిరణ్, డీజీపీ దినేశ్ రెడ్డిలపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రక్రియకు వీరిద్దరే ప్రతిబంధకంలా తయారయ్యారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో మీడియాతో మాట్లాడుతూ, ఏపీఎన్జీవోల సభకు అనుమతినిచ్చి, తెలంగాణ వాదుల శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 13 జిల్లాల ఉద్యోగులు హాజరైన సభ సమైక్యాంధ్ర భావాన్ని ఎలా చాటుతుందన్నారు. తెలంగాణ ప్రజలు కూడా తెలుగువారేనని, వారి మనోభావాలు ముఖ్యమంత్రికి అర్థంకావా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News