: కివీస్ పై ఊతప్ప ఫిఫ్టీ
విశాఖపట్నంలో జరుగుతున్న భారత్-ఎ, న్యూజిలాండ్-ఎ జట్ల మధ్య వన్డే మ్యాచ్ లో డాషింగ్ బ్యాట్స్ మన్ రాబిన్ ఊతప్ప (62 బ్యాటింగ్) అర్థసెంచరీతో అలరించాడు. ఇక్కడి వీడీసీఏ-ఏసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్-ఎ 49.4 ఓవర్లలో 257 పరుగులకు ఆలౌటైంది. ఇక లక్ష్యఛేదనకు ఉపక్రమించిన భారత్-ఎ జట్టుకు ఓపెనర్లు ఊతప్ప, కెప్టెన్ ఉన్ముక్త్ చాంద్ (49 బ్యాటింగ్) తొలి వికెట్ కు అజేయంగా 117 పరుగులు జోడించారు. దీంతో, భారత్ పని నల్లేరుపై నడకలా సాగుతోంది. భారత్-ఎ విజయానికి ఇంకా 29 ఓవర్లలో 141 పరుగులు చేయాలి. చేతిలో పది వికెట్లున్నాయి.