: కొలీజియం రద్దుకు లోక్ సభ బ్రేక్
దేశంలో సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను ఎన్నుకునే కొలీజియం వ్యవస్థ రద్దు బిల్లును లోక్ సభ వ్యతిరేకించింది. నిన్న కొలీజియం వ్యవస్థ రద్దు బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టగా అది సభ్యుల ఆమోదం పొందలేదు. దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టాలనుకున్నా అది సాధ్యంకాలేదు. ఇప్పటివరకు దేశంలో న్యాయమూర్తులను కొలీజియం ద్వారా న్యాయమూర్తులే ఎన్నుకుంటూ వస్తున్నారు. కొలీజియం వ్యవస్థలో సుప్రీం కోర్టులోని నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు. నియమించాల్సిన న్యాయమూర్తులను ఓ జాబితాలో పొందుపరిచి కేంద్రానికి పంపుతారు. దాన్ని పునఃసమీక్షించమని కోరడం మినహా, ఆ జాబితాను తిరస్కరించే అధికారం కేంద్రానికి లేదు.
అయితే, ఇకనుంచి న్యాయమూర్తుల నియామకాల్లో కార్యనిర్వాహక వర్గానికీ ప్రాతినిధ్యం ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రం కొలీజియం రద్దు బిల్లుకు రూపకల్పన చేసింది. దీనికి ప్రధాన ప్రతిపక్షంతోపాటు విపక్షాలు మద్దతిస్తున్నాయి. ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.