: విప్ జారీ చేసినా వ్యతిరేకిస్తాం : మంత్రి గంటా
సమైక్యాంధ్రకు సీమాంధ్ర నేతలందరూ కట్టుబడి ఉన్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శాసనసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే తామంతా వ్యతిరేకిస్తామని అన్నారు. ప్రభుత్వం విప్ జారీ చేసినా తాము లెక్కచేయమని, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ నెల 17న ఆర్కే బీచ్ లో జరగనున్న విశాఖ సమైఖ్య గర్జన సభను విజయవంతం చేస్తామని గంటా తెలిపారు.