: ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ భండారీ మృతి


ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి రమేష్ భండారీ తీవ్ర అనారోగ్యం కారణంగా ఢిల్లీలో నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయనకు 85 ఏళ్లు. ఆయనకు భార్య, ఒక కూతురు ఉన్నారు. పాంక్రియాటిక్ కేన్సర్ తో బాధపడుతున్న భండారీ మూడు వారాలుగా గుర్గావ్ లోని మేదాంత హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. భండారీ గతంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేశారు. తర్వాత త్రిపుర, గోవా రాష్ట్రాలకు కూడా గవర్నర్ గా వ్యవహరించారు. 1996లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన సమయంలో భండారీని గవర్నర్ గా కేంద్రం నియమించింది. భండారీ మృతి పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News