: బెజవాడలో మేం సభ పెడతామంటే అనుమతిస్తారా?: కోదండరాం


ఏపీఎన్జీవోలు హైదరబాద్ లో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం అయిన నేపథ్యంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వింతవాదన తెరపైకి తెచ్చారు. తాము విజయవాడలో తెలంగాణ సభ పెట్టేందుకు అనుమతిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణవాదానికి మద్దతిచ్చే పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి సీమాంధ్రలో సభ పెట్టుకుంటామంటే ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. ఇక జేఏసీ ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, తెలంగాణలో సభ పెట్టుకుని తెలంగాణ వ్యక్తులపై దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు.

  • Loading...

More Telugu News