: కేబీసీ 7లో కోటి తన్నుకుపోయిన హిస్టరీ టీచర్
కౌన్ బనేగా కరోడ్ పతి 7వ సిరీస్ లో రాజస్థాన్ లోని ఉదయపూర్ పట్టణానికి చెందిన ఒక హిస్టరీ టీచర్ కరోడ్ పతి అయ్యారు. అమితాబ్ బిగ్గర స్వరంతో అడిగిన కోటి రూపాయల చివరి ప్రశ్నకు అత్యంత ఉత్కంఠ నడుమ సరైన సమాధానం చెప్పిన తాజ్ మొహమ్మద్ రంగ్రెజ్ విజేతగా నిలిచాడు. కేబీసీ7లో కోటి గెలిచిన తొలి విజేత ఇతడే. ఈ కార్యక్రమం సోనీ టీవీలో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.
తాజ్ మొహమ్మద్ ఈ కోటి రూపాయలను ఎలా వినియోగించేదీ చెప్పారు. ఈయనకు అంధురాలైన కూతురు ఉంది. కూతురికి చికిత్స చేయించాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అలాగే, ముగ్గురు పేద బాలికలకు విద్యాదానం చేయడం, ఇద్దరు అనాథ బాలికలకు వివాహం జరిపించడం ఆయన ముందున్న ప్రాధమ్యాలు.