: మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై బీజేపీదే నిర్ణయం: ఆర్ఎస్ఎస్
బీజేపీ తరఫున వచ్చే ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా మోడీ పేరును ప్రకటించడంపై బీజేపీనే నిర్ణయం తీసుకుంటుందని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. తమ అభిప్రాయాన్ని బీజేపీకి తెలియజేశామని ఆర్ఎస్ఎస్ ప్రతినిధి మన్మోహన్ వైద్య తెలిపారు. ఆర్ఎస్ఎస్ మోడీకే మద్దతు ప్రకటించిందని సమాచారం. నేటి నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో జరగనున్న ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, బీజేపీ సమైక్య భేటీలో మోడీ అభ్యర్థిత్వం చర్చకు రానుంది. బీజేపీ తరుపున ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీ పేరును ఎప్పుడు ప్రకటించాలో ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అయితే, పార్టీ సీనియర్ నేత అద్వానీ మాత్రం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసేవరకు (డిసెంబర్) నిర్ణయాన్ని నిలిపివేయడం మంచిదని కోరుతున్నారు.