: అన్ని భారతీయ భాషల్లోనూ ఆర్ఆర్ బీ: రైల్వే మంత్రి
రైల్వే నియామకాల పరీక్షను ఇక నుంచి అన్ని భాషల్లోనూ నిర్వహిస్తామని రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ భన్సల్ వెల్లడించారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన ఈ విషయం ప్రకటించారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే మహిళలకూ సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు.