: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నేతలతో రాహుల్ భేటీ
వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పార్టీకి ఘనవిజయం సాధించి పెట్టేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్సర్ సైజ్ మొదలుపెట్టారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, శాసనసభాపక్ష నేతలు, పీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశాలు ఈ నెల 23 నుంచి 28 వరకు జరగనున్నాయి. రానున్న ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే విషయాలను చర్చించనున్నట్టు సమాచారం.