: 20 రోజుల్లో ఉల్లి ధరలు దిగి వస్తాయి: కేంద్రం


ఉల్లి ధరలతో కన్నీళ్ళు పెడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించేలా ఓ విషయాన్ని చెప్పింది. దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వేసిన కొత్త పంట మార్కెట్ కు రాగానే 15, 20 రోజుల్లో ఉల్లి ధరలు దిగి వస్తాయని ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కేవీ థామస్ చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉల్లి ధరలపై మాట్లాడాలని సమాజ్ వాదీ పార్టీ నేత నరేష్ అగర్వాల్ డిమాండ్ చేశారు. దాంతో, మాట్లాడిన థామస్.. సాధారణంగా ఉల్లి ధరలు జులై, అక్టోబర్ నెలల్లో పెరిగిపోతాయని చెబుతూ, రబీ సీజన్ అయిన మార్చి-జూన్ లో 60 శాతం దేశాలు ఉల్లిపాయలను మార్కెట్ కు తెస్తాయన్నారు. మిగతా 40 శాతం ఖరీఫ్ సీజన్ లో అంటే అక్టోబర్-డిసెంబర్ లో, లేట్ ఖరీఫ్ సీజన్ జనవరి-మార్చి కాలంలో తీసుకొస్తారని మంత్రి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News