: సమైక్యాంధ్రకోసం రాజీనామాలు చేసింది టీడీపీనే: గాలి
సమైక్యాంధ్ర కోసం పదవులను తృణప్రాయంగా త్యజించింది టీడీపీ నేతలేనని ఆ పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలిపారు. తిరుపతి కృష్ణాపురం ఠాణా వద్ద టీడీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. జగన్ కు బెయిల్ కోసమే విజయమ్మ కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు.