: జమ్మూకాశ్మీర్లో గ్రనేడ్ దాడి.. తొమ్మిది మందికి గాయాలు


జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాజిల్లాలో శనివారం మిలిటెంట్ లు జరిపిన గ్రనేడ్ దాడిలో తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురు పోలీసులు కూడా ఉన్నారు. పుల్వామా జిల్లాలో మురాన్ చౌక్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిని హుటాహుటీన స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ దాడికి పాల్పడింది తామేనని ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు.

  • Loading...

More Telugu News