: ఏపీ పరిస్థితిని ప్రభుత్వం చక్కదిద్దుతుంది: చిదంబరం
రాష్ట్ర విభజన ప్రకటనతో సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమం, బంద్ ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం ఎప్పటిలాగే మాట్లాడారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పరిస్థితిని ప్రభుత్వం చక్కదిద్దుతుందంటున్నారు. ఇందుకోసం ఆ దిశగా కృషి చేస్తోందని చెప్పారు. ఇలాంటి సమయాల్లోనే ప్రత్యేక రాష్ట్ర వాదులు సంయమనం పాటించాలని సూచించారు. ప్రధానంగా హైదరాబాదులో శాంతిభద్రతలు నెలకొనేందుకు అందరూ సహకరించాలన్నారు.