: ఏపీలో దుస్థితికి కాంగ్రెస్సే కారణం: మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ఎన్నికల ప్రచార సారధి నరేంద్ర మోడీ ఛత్తీస్ గఢ్ ఎన్నికల సందర్భంగా అంబికాపూర్ లో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ ఎర్రకోట ఆకృతిలో ఏర్పాటు చేసిన వేదికపై ప్రసంగిస్తూ.. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు. రాష్ట్ర విభజన ఒక ఆమోదంలేని విభజన అని అన్నారు. ఇక ప్రధాని మన్మోహన్ సింగ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని నిర్వహణ లోపంవల్లే దేశంలో ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ఆయన చికిత్సవల్లే ప్రస్తుతం రూపాయి ఆసుపత్రిలో పడకేసిందని విమర్శించారు. కాగా, ఛత్తీస్ గఢ్ అభివృద్ధిపై మాట్లాడిన మోడీ.. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ను ప్రశంసించారు.