: విభజన జరిగితే ఆర్టీసీ 13 జిల్లాల్లో మూతపడుతుంది: చంద్రశేఖర్
రాష్ట్ర విభజన జరిగితే ఆర్టీసీ 13 జిల్లాల్లో మూతపడడం ఖాయమని ఆర్టీసీ కార్మిక సంఘం నేత చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో మాట్లాడుతూ.. అప్పట్లో బళ్ళారిని కర్ణాటకకు కోల్పోయామని, ఇప్పుడు హైదరాబాదును కోల్పోయే ప్రమాదం కనిపిస్తోందని అన్నారు. హైదరాబాదు విడిపోతే పిల్లల భవిష్యత్ ఏమైపోవాలని ఆయన ఉద్వేగంతో ప్రశ్నించారు. తాము ఏ ప్రాంతానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడంలేదని చెప్పారు. హైదరాబాదును కోల్పోతామన్న ఆందోళన అందరిలోనూ నెలకొందని అన్నారు.