: మళ్లీ రాష్ట్రానికి అన్యాయమే: గాలి ముద్దుకృష్ణమ నాయుడు
లోక్ సభలో ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ పై వివిధ పార్టీల నుంచి ఆరోపణలు మొదలయ్యాయి. ఈసారి బడ్జెట్ లో మళ్లీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. బన్సల్ బడ్జెట్ రాష్ట్రానికి ద్రోహం చేసిన బడ్జెట్ అని విమర్శించారు. రైలు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేలా బడ్జెట్ లేదని ఎద్దేవా చేశారు. సరుకు రవాణా ఛార్జీల పెంపు కారణంగా ద్రవ్యోల్భణం పెరుగుతోందన్నారు.