: నవ్వు చూసి ఆరోగ్యాన్ని చెప్పేయొచ్చు
ఒక నవ్వు నవ్వితే చాలు.. మీ ఆరోగ్యం ఏంటో చెప్పేయొచ్చు. అదెలా..! మీ దంతాలే మీ ఆరోగ్య సూచికలు.
అవునండీ.. ముందు మీ నోరు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. నోటిలో బ్యాక్టీరియా పేరుకుపోతే పళ్లు పుచ్చడమే కాదు.. పలు అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. రోజుకో ఆరోగ్య పరీక్షలో భాగంగా ఈ రోజు మరొకటి.
ఆరోగ్య పరీక్ష - 4
ఆరోగ్య పరీక్ష - 4
ప్రతీ ఆరు నెలలకోసారి దంత వైద్యులను కలవడం మంచిది. వయసుతో సంబంధం లేకుండా, చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ ఈ సూత్రం వర్తిస్తుంది. సహజంగా భారతీయులకు దంత దావనం (బ్రష్ చేసుకోవడం)పై అంతగా అవగాహన లేదనే చెప్పాలి. ఎందుకంటే నేడు దేశంలో ఎంతో మంది యుక్త వయసులోనే పళ్లు పుచ్చిపోవడమనే సమస్యతో బాధపడుతున్నారు.
రోజులో ఉదయం లేచిన వెంటనే, రాత్రి నిద్రించే ముందు పళ్లు శుభ్రం చేసుకోవాలి. కానీ దీనిని పాటించేవారు చాలా తక్కువ. ఎక్కవ మంది రోజులో ఒక్కసారితోనే సరిపెడతారు. ఫలితంగా తిన్న ఆహార పదార్థాలు పళ్ల సందులలో ఇరుక్కుపోయి... కుళ్లిపోవడంతో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఫలితంగా అక్కడ పన్ను పుచ్చిపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల చిగుర్లు కూడా దెబ్బతింటాయి.

పళ్లు పుచ్చిపోవడం, పంటి చిగుళ్ల సమస్యలు గుండె జబ్బులకూ కారణమయ్యే ప్రమాదం లేకపోలేదు. పళ్లు పుచ్చితే దానివల్ల ధమనులలో రక్త ప్రసరణకు అవాంతరం ఏర్పడి గుండె జబ్బులకు కారణమవుతుందని ఫిలిప్పీన్స్ వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. అలాగే పళ్ల నిర్మాణం కూడా దెబ్బతినే ప్రమాదముంది. ఒక పన్ను పుచ్చితే అది పక్కనున్న పన్నునూ దెబ్బతీస్తుంది. ఏదైనా తాగినప్పడు, తింటున్నప్పుడూ పంటినొప్పి వచ్చిందంటే మీరు ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాల్సిందే.
అందంలోనే కాదు, ఆరోగ్యంలోనూ నోటి పరిశుభ్రత ఎంతో ముఖ్యం. కనుక తప్పనిసరిగా క్రమం తప్పకుండా దంత వైద్యులను కలుస్తూ ఉండండి. ముత్యాల్లాంటి దంతాలతో ఆరోగ్యంగా నవ్వుతూ ఉండండి.