: 35 మంది గురుకుల పాఠశాల విద్యార్థినులకు అస్వస్థత
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం దగ్గరి రుస్తుంబాదలో వెనుకబడిన తరగతుల బాలికల గురుకుల పాఠశాలలో 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం అల్పాహారంలో చట్నీకి ఉపయోగించిన వేరుశనగ గుళ్లు నిల్వఉంచినవి కావడమే ఇందుకు కారణమని విద్యార్థులు చెబుతున్నారు. ఎల్బీచర్ల పీహెచ్ సీ వైద్యులు కేవీ రామకృష్ణ గురుకుల పాఠశాలను సందర్శించి వైద్యపరీక్షలు చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థినులను నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.