: మోడీ సిసలైన బ్రహ్మచారి: మల్లికా శరావత్


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని బాలీవుడ్ శృంగారతార మల్లికా శరావత్ నోరారా ప్రశంసించింది. 62 ఏళ్ల నరేంద్రమోడీని అసలైన బ్రహ్మచారిగా పేర్కొంది. 36 ఏళ్ల మల్లిక త్వరలో తన జీవిత భాగస్వామిని 'ద బ్యాచులరేట్ ఇండియా-మేరే ఖయాలోన్ కి మల్లిక' అనే టీవీ కార్యక్రమం ద్వారా ఎంచుకోనుంది. ఈ నేపథ్యంలో దేశంలో అన్ని అర్హతలూ ఉన్న బ్రహ్మచారి ఎవరు? అన్న ప్రశ్నకు 'నరేంద్ర మోడీ' అంటూ మల్లిక తనదైన శైలిలో బదులిచ్చింది. 'మోడీ స్మార్ట్, పనితీరు గల వ్యక్తి. తరచుగా నాలాగే అపార్థం చేసుకుంటూ ఉంటారు' అంటూ మల్లిక తన అభిప్రాయాలను తెలిపింది.

ద బ్యాచులరేట్ కార్యక్రమం లైఫ్ ఓకే చానల్ లో అక్టోబర్ 7 నుంచి ప్రసారం కానుంది. మొత్తం 30 మంది పోటీదారులు మల్లిక శరావత్ మనసు గెలుచుకునేందుకు పోటీ పడనున్నారు. వీరిలో పాపం మోడీ లేరు. ఉండి ఉంటే మల్లిక నమో(నరేంద్ర మోడీకి సంక్షిప్త నామం) అని జై కొట్టి ఉండేదేమో! నరేంద్ర మోడీకి వివాహం అయిందని, తన ఆశయాల కోసం భార్యతో విడివడి ఉంటున్నారన్న సంగతి మల్లికకు తెలుసో లేదో.. ?

  • Loading...

More Telugu News