: కండోమ్ మెషీన్లను దొంగలు ఎత్తుకెళ్లారు?
ప్రాణాంతక హెచ్ఐవీ వైరస్ సోకకుండా ఉండేందుకు ఎయిడ్స్ నియంత్రణ జాతీయ ఆర్గనైజేషన్ (నాకో) బహిరంగ ప్రదేశాలలో కండోమ్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేసింది. కండోమ్స్ ను అందుబాటులో ఉంచడం ద్వారా లైంగిక వ్యాధులు రాకుండా నిరోధించే లక్ష్యంతో వీటిని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేయగా.. ఈ మెషీన్లు 90 శాతం గల్లంతయ్యాయట. కాగ్ ఈ మేరకు నాకో కార్యకలాపాలను ఆడిట్ చేసి పార్లమెంటుకు ఒక నివేదిక సమర్పించింది. ఎయిడ్స్ వ్యాప్తికి ఎక్కువ అవకాశాలు ఉన్నచోట కండోమ్స్ ను అందుబాటులో ఉంచడంలో నాకో విఫలమైందని కాగ్ తేల్చింది.
మొదటి దశలో ఎయిడ్స్ రిస్కు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నాకో 11,025 కండోమ్ వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేస్తే వీటిలో 1,130 మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగతా 9,860 మెషీన్లు మాయమయ్యాయని కాగ్ తేల్చింది. రెండో దశలో 1546 మెషీన్లు పాడైపోగా, 161 మెషీన్లు తస్కరణకు గురయ్యాయట. 1,791 మెషీన్లను అసలు ఏర్పాటు చేయలేదని కాగ్ పేర్కొంది. మొదటి శ 2005 సెప్టెంబర్ లో, రెండో దశ 2008 జూలైలో మొదలైంది.